స్వామి శరణం అయ్యప్ప శరణం) కార్తీక మాసంలో అయ్యప్ప మాలాదారణ వేసి, మండలం దీక్ష చేసి ,స్వామికి ఇరుముడి కట్టుకుంటారు భక్తులు, ఇలా అయ్యప్పలు ఎంతో కఠినమైన దీక్షతో మండలం రోజులు స్వామి సేవలో లీనం అవుతారు.. శాంత మూర్తులుగా అయ్యప్ప స్మరణతో నిత్యం స్వామి భజనలతో కనిపిస్తారు. అయితే సాధారణ జనం వ్యాపారులు ఉద్యోగులు అయ్య ప్ప మాల వేసుకుని దీక్ష చేస్తు ఉంటడం చూస్తాం. కాని అయ్యప్ప మాల వేసుకునే హీరోలు ఉంటారు అనేది తెలుసా, అవును సినిమా ఇండస్ట్రీ వారు కూడా కొందరు అయ్యప్ప మాల వేసుకుని స్వామిని భక్తి శ్రద్దలతో కొలుస్తారు. అలాంటి వారు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు,
షూటింగులు ఉన్నా స్వామి మాల వేసుకున్న రోజుల్లో సినిమాలు పక్కన పెడతారు, ఇదేమీ చిన్న విషయం కాదు ఎంతో కఠినంగా ఉండాలి అలాగే ఉంటారు , అంతేకాదు పాదరక్షలు వేసుకోకుండా, మద్యం మాంసం తీసుకోకుండా ఉండాలి. కటికి నేలపై పడుకోవాలి, ఇలా చాలా నియమాలు పాటించాలి. మరి టాలీవుడ్ లో అయ్యప్ప మాల వేసుకునే వారు ఎవరో చూద్దాం
స్టార్ హీరో రామ్ చరణ్ చిరంజీవి,నాగ బాబు కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు.
మంచు మనోజ్
శర్వానంద్,
నిర్మాత సురేష్ బాబు
శరత్ బాబు
రాజేంద్ర ప్రసాద్,
మురళి మోహన్
బిగ్ బి అమితాబ్
కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్
ప్రముఖ గాయకుడు ఏసుదాసు
రజనీకాంత్
వివేక్ ఒబెరాయ్, ఇలా చాలామంది స్వామి మాల వేసుకున్న వారు ఉన్నారు.