మగవారి కోసం గర్భనిరోధక జెల్ ఎలా వాడాలంటే

మగవారి కోసం గర్భనిరోధక జెల్ ఎలా వాడాలంటే

0
113

పిల్లలు అప్పుడే వద్దు అనుకునే వారు ముఖ్యంగా పురుషులు కండోమ్స్ అలాగే వేసెక్టమీ కూడా వాడేవారు
కాని ఇప్పుడు దీనికో ప్రత్యామ్నాయం వచ్చేసింది… గర్భనిరోధక జెల్ అందుబాటులోకి రానుంది..కండోమ్స్ పిల్స్ వాడటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అందుకే ఈ జెల్ ని తీసుకువస్తున్నారు వైద్యులు.

దీనిని మరో రెండు సంవత్సరాలల్లో మార్కెట్ లోకి తీసుకురానున్నారట.. ఇప్పటికే దీని గురించి పరిశోధనలు కూడా జరిపారు శాస్త్రవేత్తలు.. ఇది ముందుగా ఎలుకలపై పరిశోధన చేశారు, దీని నుంచి మంచి సత్ఫలితాలు వచ్చాయి అని తెలుస్తోంది. అయితే దీని గురించి క్లుప్తంగా తెలుసుకుంటే.

వసల్జేల్ అని పిలిచే ఈ కొత్త జెల్ని పురుషులలో గర్భనిరోధకానికి అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ జెల్ పురుషులలో ఇంజెక్ట్ చేసి వీర్యంతో పాటు వీర్యకణాలను బయటికి రాకుండా ఆపుతాయి. దాని వల్ల కండోమ్ లేకున్నా గర్భం రాదు అని చెబుతున్నారు. సో ఇది ఇంకా మార్కెట్లో కి రాలేదు, వేరే జెల్ అని చెప్పినా వాడకండి అంటున్నారు వైద్యులు, 2022 కి అందరికి అందుబాటులోకి రానుందట