టాలీవుడ్లో వరుసగా పవన్ కల్యాణ్ సినిమాలు ఒకే చేస్తున్నారు , అంతేకాదు చేతిలో ఆయనకు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. వచ్చే రెండు సంవత్సరాలు ఆయన చాలా బిజీ అనే చెప్పాలి, అయితే ఇటీవల మలయాళ సూపర్ హిట్ అయ్యప్పమ్ కోషియమ్ రీమేక్ చేయనున్నట్లు ప్రకటించారు, ఈ సినిమాకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ తెలిపింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తారు అని తెలుస్తోంది.. డైరెక్టర్ సాగర్ కే చంద్ర చిత్రం తెరకెక్కిస్తారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైంది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన సాయిపల్లవిని ఫైనల్ చేసే ఆలోచన చేస్తున్నారు, ఇక రానాకి జోడి ఎవరు అనేదానిపై టాక్ నడుస్తోంది.
రానాకి తాజాగా టాలీవుడ్ లో ఓ అందాల తార పేరు వినిపిస్తోంది…విలేజ్ లుక్లోనూ గ్లామర్ ఒలకబోసే గ్రేస్ ఉన్న ఆ బ్యూటీ రెజీనా కసాండ్రాని ఫైనల్ చేయనున్నారట, ఇందులో రానా ఫుల్ యాంగ్రీగా కనపిస్తారట, సో చిత్ర యూనిట్ ఇప్పటికే అందరితో సంప్రదింపులు జరుపుతోంది, మరి దీనిపై ఇంకా ఫైనల్ ప్రకటన రావాల్సి ఉంది, వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.