మెగాస్టార్ గారు నాకు ఆరోజు చెప్పిన మాట జీవితంలో మర్చిపోలేను – యాంకర్ ప్రదీప్

మెగాస్టార్ గారు నాకు ఆరోజు చెప్పిన మాట జీవితంలో మర్చిపోలేను - యాంకర్ ప్రదీప్

0
40

టెలివిజన్ ప్రేక్షకులు ఎంత మంది మేల్ యాంకర్లు వచ్చినా ప్రదీప్ ను మర్చిపోరు, ఇప్పటికీ ఏ షో చేసినా ప్రదీప్ కు ఆ పేరు ఫేమ్ నేమ్ అలాగే ఉంది ..ఇటు మహిళ అభిమానులు కూడా ప్రదీప్ కు చాలా మంది ఉన్నారు, యాంకరింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రదీప్. ఇప్పుడు సినిమాలు కూడా చేస్తు బిజీగా మారారు ప్రదీప్.

తాజాగా ఆయన సుమ నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్షోలో సందడి చేశారు. తన పర్సనల్ లైఫ్ గురించి బయటవారికి తెలియని ఎన్నో సరదా సంగతులను పంచుకున్నారు యాంకర్ ప్రదీప్, ఈ సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారిని మొదటిసారి కలవడానికి వెళ్లాను, ఈ సమయంలో ఆయన నన్ను దగ్గరకు పిలిచారు.

నీ యాంకరింగ్ చాలా బాగుంటుంది నీ మాటలు బాగుంటాయి …మీ వాయిస్ నాకు బాగా ఇష్టం. మీరు పలికే తెలుగు పదాల ఉచ్చారణ నాకెంతో నచ్చుతుంది అని ఆయన ప్రశంసించారు. ఇక నేను అలాగే అక్కడ ఉండిపోయాను, అది జీవితంలో మర్చిపోలేని ప్రశంస అని తెలిపారు ప్రదీప్. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని తెలిపారు ప్రదీప్.