కీలక ప్రకటన చేసిన నువ్వు నేను హీరోయిన్

Bad news for Nuvu Nenu Heroine Anitha Fans

0
93

టాలీవుడ్ లో అనిత హీరోయిన్ గా ఎంత మంచి పేరు తెచ్చుకుందో తెలిసిందే. అనేక చిత్రాలు చేసింది ఆమె. యంగ్ హీరోలతో సినిమాల్లో నటించింది. అయితే తాను తన కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత సినీ పరిశ్రమకు దూరం కావాలని, ఎప్పటినుంచో అనుకుంటున్నానని నువ్వు-నేను హీరోయిన్ అనిత చెప్పింది.

ఇక తన బిడ్డ సంరక్షణ చూసుకోవాలని,ఇది తనకు ఎంతో అవసరమని, ఇక పై తాను సినిమాలు సీరియల్స్ చేయను అని దూరంగా ఉంటాను అని తెలిపింది.
ఇక ఇప్పుడు చేయను కానీ భవిష్యత్తులో సినిమాలు సీరియల్స్ చేస్తారా అనేదానిపై ఇంకా ఇప్పుడు చెప్పలేను అని తెలిపింది.

తాను ఇప్పుడు కొన్ని కమర్షియల్ యాడ్స్లో పనిచేస్తున్నానని చెప్పింది అనిత. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన నువ్వు-నేను సినిమాలో హీరోయిన్గా అనిత నటించారు. ఆమెకి ఈ సినిమా ద్వారా ఎంతో పేరు వచ్చింది. నాగిని సీరియల్ లోనూ ఆమె నటిస్తున్నారు. పారిశ్రామికవేత్త రోహిత్ను 2013లో ప్రేమించి పెళ్లి చేసుకుంది అనిత. ఇక ఆమె ప్రకటనతో అభిమానులు కాస్త ఢీలా పడ్డారు.