ఉస్మానియా యూనివర్సిటీలో బలగం సినిమా ప్రదర్శన

-

ఏ అంచనాలు లేకుండా విడుదలై బలగం(Balagam) మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబాలకు కుటుంబాలకే థియేటర్లకు క్యూ కడుతున్నాయంటే సినిమా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు వీసీ గుడ్ న్యూస్ చెప్పారు. ‘బలగం(Balagam)’ సినిమాను ఏప్రిల్ 6వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ (ఐఎస్) డైరెక్టర్ ఒక సర్క్యూలర్ జారీ చేశారు. యూనివర్సిటీ వీసీ ఆదేశాల మేరకు బలగం సినిమాను ఏప్రిల్ 6న ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు స్క్రీనింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. క్యాంపస్ పరిధిలోని కాలేజీల విద్యార్థులు మూవీని వీక్షించడానికి తమ పేర్లను నమోదు చేయించుకుని, ఐడీ కార్డులతో రావాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనం, కుటుంబ బంధాలతో రూపొందిన ఈ సినిమాను టాలీవుడ్‌లో కమెడియన్‌, జబర్ధస్త్ ఫేమ్ వేణు(Venu) తెరకెక్కించారు.

- Advertisement -
Read Also: సెక్స్ తర్వాత ఇలా చేస్తే మీ పార్ట్ నర్ హర్ట్ అయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త..!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...