బాలకృష్ణ- అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ ఫిక్స్?

0
112

బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం గోపి చంద్ మలినేనితో NBK 107 సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత అనిల్ రావిపూడితో మరో సినిమా ప్లాన్ చేశాడు. ఇవే కాక ఆదిత్య 369కి సీక్వెల్, అఖండ సీక్వెల్ కు నందమూరి నటసింహం ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పటికే NBK 107 ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. కొండారెడ్డి బురుజు సెంటర్‌ సహా అక్కడి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్​ జరుగుతోంది. ఈ సినిమా అనంతరం బాలకృష్ణ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నారు.

ఈ చిత్రంలో బాలయ్య ఐదు పదుల వయసున్న తండ్రిగా కనిపించనున్నారు. ఆయన కూతురు పాత్రను శ్రీలీల పోషించనుంది. మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఆమెకు కథ వినిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.