మంకీఫాక్స్ ఉన్న గర్భిణీకి ఆరోగ్యకరమైన బిడ్డ జననం!

0
30

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మంకీఫాక్స్ టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మంకీపాక్స్‌తో బాధపడుతున్న ఓ గర్భిణీ ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఇద్దరూ బాగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు. తల్లికి ఏదైనా వ్యాధి సంక్రమిస్తే పుట్టిన పిల్లాడికి కూడా అదే లక్షణాలు కలిగి ఉండేదన్నారు. కానీ బిడ్డకు ఆరోగ్యంగా పుట్టడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు.