కబడ్డీ కోర్టులో తొడగొట్టిన బాలకృష్ణ.. వీడియో వైరల్..

-

నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) మరో యాడ్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. కబడ్డీ లీగ్ కోసం యోధుడి అవతారం ఎత్తారు. ప్రో కబడ్డీ లీగ్(Pro Kabaddi League) కోసం బాలయ్యతో పాటు కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్(Kichcha Sudeep), బాలీవుడ్ హీరో టైగర్ ష్రాప్(Tiger Shroff)లు రంగంలోకి దిగారు. ఈ యాడ్‌లో ముగ్గురు గుర్రాల మీద యోధుల్లాగా వచ్చి కబడ్డీ కోర్టు నిప్పుతో గీసి, కబడ్డీ ఆడినట్టు చూపించారు. చివర్లో బాలయ్య మ్యాచ్ గెలిచి తొడకొట్టడం అభిమానులకు ఆకట్టుకుంటుంది.

- Advertisement -

దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కబడ్డీ.. మన మట్టిలో పుట్టిన ఆట. మన తెలుగువాడి పౌరుషాన్ని తెలిపే ఆట. కండల బలమే ఆయుధంగా, మైదానమే రణస్థలంగా, పోరాడే ఈ దమ్మున్న ఆటను అస్సలు మిస్ కావద్దు’ అంటూ నిర్వాహకులు పోస్ట్ చేశారు. ఇక ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 డిసెంబర్ 2 నుంచి మొదలు కానుంది. ఇక ఇప్పటికే వరుసగా హ్యాట్సిక్ హిట్స్‌తో మంచి ఊపు మీదున్న బాలయ్య(Balakrishna).. తన తదుపరి చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

Read Also: ఎక్కువ రోజులు శృంగారానికి దూరంగా ఉంటే.. స్త్రీలకు ఆ సమస్యలు!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Traffic Volunteers | ట్రాన్స్‌జెండర్లకూ ఉపాధి అవకాశాలు.. ఎలా అంటే..

రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు...

Nagarjuna | ‘ఇది చాలా గొప్ప క్షణం’.. చైతూ పెళ్ళిపై నాగార్జున సంతోషం

నాగచైతన్య(Naga Chaitanya), శోభిత(Sobhita)ల పెళ్ళిని ఇరు కుటుంబాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు. కుటుంబీకులు,...