దసరా కంటే ముందే బాలయ్య అఖండ సినిమా- రిలీజ్ డేట్ అదేనా ?

Balayya Akhanda movie before Dussehra

0
114

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నారు. ఇక కరోనా వల్ల షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. తాజాగా షూటింగ్ మళ్లీ మొదలైంది. ఇక ఈ నెలాఖరున షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోనున్నారు.
ఈ సినిమా దసరాకి వస్తుందని అంతా భావించారు. బాలకృష్ణకి దసరా సెంటిమెంట్ ఎక్కువ అందుకే ఈ సమయంలో చిత్రం వస్తుంది అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. అయితే మేకర్స్ మరో ఆలోచనలో ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం వినాయక చవితికి ఈ సినిమా విడుదల చేయనున్నారు అని తెలుస్తోంది. అఖండ సినిమా అనుకున్న ప్రకారం షూటింగ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ముందుగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయనున్నామని స్పష్టత ఇచ్చేశారు.

అందుకే అఖండ వినాయక చవితికి ప్లాన్ చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పెద్ద సినిమాలు కూడా ఇప్పుడు ఇదే ప్లాన్ లో ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ డేట్ ఇవ్వడంతో దసరా బరిలో ఏ సినిమాలు ఉంటాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు. మిగిలిన సినిమాల రిలీజ్ డేట్ పై క్లారిటీ కోసం అభిమానులు చూస్తున్నారు.