బ్రేకింగ్ న్యూస్ – సరికొత్త ప్యాకింగ్ లో తిరుమల లడ్డూలు

Tirumala laddu in the newest packing

0
36

తిరుమల కు వెళ్లిన వారు ఎవరైనా శ్రీవారి లడ్డూ ప్రసాదం కచ్చితంగా తీసుకుంటారు. ఇక బంధువులు, మిత్రులు అందరికి ఇస్తారు. తిరుపతి వెళితే లడ్డూ ప్రసాదం కూడా ఇరుగుపొరుగు వారు అడుగుతారు. అంత ప్రఖ్యాతిగాంచింది లడ్డూ.
ఈ లడ్డూ రుచి దేనికీ ఉండదు. శ్రీవారి ప్రసాదాలు ఎన్ని రకాలు ఉన్నా లడ్డూ ప్రసాదం ప్రత్యేకతే వేరు. లడ్డూ ప్రసాదం ఇక నుంచి ఓ ప్రత్యేకమైన కవర్ ప్యాకింగ్ లో చేయనున్నారు.

ఆ కవర్ పర్యావరణహితమైనది. భూమిలో చాలా త్వరగా కలిసిపోతుంది. ప్లాస్టిక్ సమస్య అనేది ఉండదు.అయితే ఈ సంచిలు ఎలా తయారు చేశారంటే. కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచీలు తయారు చేశారు.
ప్లాస్టిక్ కవర్లు భూమిలో కలవటానికి వందల ఏళ్లు పడుతుంది. పర్యావరణానికి ఎంతో హని కలుగుతోంది అందుకే ఈ సరికొత్త సంచిలు తీసుకువచ్చారు.

ఇక నుంచి ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కేవలం కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచీ ఎకొలాస్టిక్ల కి అంగీకారం తెలిపారు. ప్లాస్టిక్ కు బదులుగా ఎకొలాస్టిక్ వంటి ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ను వాడటం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు అని తెలిపారు అధికారులు.