నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ నుంచి టైటిల్ సాంగ్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. పూర్తి పాటను ఈరోజు ప్రేక్షకుల ముందుకుతీసుకొచ్చారు. ఇందులో బాలయ్య డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు.
బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇంతకు ముందు ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలతో బ్లాక్బస్టర్లు కొట్టిన వీరిద్దరూ..ఇప్పుడు మూడో సినిమాతో తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ.. ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతమందించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.
వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి
https://www.youtube.com/watch?v=9n1refHexDY&feature=emb_title