బాలయ్య ‘అఖండ’ టైటిల్​ సాంగ్​ వచ్చేసింది!

Balayya 'Akhanda' title song has arrived!

0
35

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ నుంచి టైటిల్ సాంగ్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ సాంగ్ టీజర్​ ను రిలీజ్ చేశారు. పూర్తి పాటను ఈరోజు  ప్రేక్షకుల ముందుకుతీసుకొచ్చారు. ఇందులో బాలయ్య డిఫరెంట్ గెటప్స్​లో కనిపించనున్నారు.

బాలయ్య-బోయపాటి కాంబినేషన్​లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇంతకు ముందు ‘సింహా’, ‘లెజెండ్​’ చిత్రాలతో బ్లాక్​బస్టర్​లు కొట్టిన వీరిద్దరూ..ఇప్పుడు మూడో సినిమాతో తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ.. ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతమందించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=9n1refHexDY&feature=emb_title