కొత్త గెటప్ తో బాలయ్య ఎంట్రీ..అభిమానులకు పూనకాలే అంటున్న డైరెక్టర్

0
118

ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ తన నటనతో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. సీనియర్ హీరోయిన్ ల నుండి ముద్దుగుమ్మల వరకు అందరితో నటించిన ఈ హీరో తాజాగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సెప్టెంబరులో మొదలు కానున్నట్టు దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు.

బాలకృష్ణతో సెప్టెంబరులో సినిమా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ ఇప్పటి వరకు చేయని కొత్త పాత్రను చేయబోతున్నాయని అనిల్‌ రావిపూడి తెలిపారు. ప్రేక్షకులు కూడా ఊహించని నూతన గెటప్ తో మీ ముందుకు రాబోతున్నట్టు తెలిపారు.

ఇప్పటికే వీళ్లిద్దరి కామినేషన్ లో మూడు సినిమాలు చేసి..విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. కాబట్టి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. అంతేకాకుండా మే 27న ఎఫ్‌-3 విడుదలకు సిద్దంగా ఉంది అని తెలిపారు. ఇందులో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ తమదైన శైలిలో నటన చేసి ప్రేక్షకులను అలరించనున్నట్టు తెలిపారు.