సాహో ట్రైలర్ పై బాలయ్య అభిమానుల సెటైర్లు !

సాహో ట్రైలర్ పై బాలయ్య అభిమానుల సెటైర్లు !

0
85

‘సాహో’ ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనాలు కొనసాగిస్తోంది. ఈ మూవీ మ్యానియా మొదలు కావడంతో ఈ నెల 18న హైదరాబాద్ లో జరగబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్రభాస్ అభిమానులు కలలు కంటున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ సొంత ఊరు భీమవరం నుండి వేల సంఖ్యలో కార్లు బస్సులలో అభిమానులు రాబోతున్నట్లు సమాచారం.

ఈ ఈవెంట్ కు వచ్చే తన అభిమానులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా చేయాలని ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినట్లు టాక్. ‘సాహో’ మ్యానియా ఇలా కొనసాగుంటే నందమూరి బాలకృష్ణ అభిమానులు ఈ మూవీ ట్రైలర్ ను టార్గెట్ చేస్తూ చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

ఈ మూవీ ట్రైలర్ లో ప్రభాస్ ను అండర్ కవర్ కాప్ గా పరిచయం చేసారు. అంతేకాదు దీనికి సంబంధించి ప్రభాస్ ఫోటోతో ఒక ఐడి కార్డ్ ను కూడ ఈ ట్రైలర్ లో చూపించారు. ఆ ఐడి కార్డ్ లో ప్రభాస్ పేరు అశోక చక్రవర్తిగా చూపెట్టారు. 30 సంవత్సరాల క్రితం ఇదే టైటిల్ తో బాలయ్య హీరోగా ఒక సినిమా వచ్చింది ఈ సినిమాలో కూడ బాలయ్య డాన్ గా నటించాడు.

దీనితో బాలయ్య పాత్ర పేరును ప్రభాస్ కోసం సుజిత్ కాపీ కొట్టాడు అంటూ బాలయ్య అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా ‘సాహో’ కు సంబంధించిన ప్రభాస్ పాత్రకు కనీసం ఒరిజినాలిటీతో కూడుకున్న పేరును కూడా ఆలోచించలేని స్థితిలో ‘సాహో’ దర్శక నిర్మాతలు ఉన్నారా అంటూ విపరీతంగా బాలయ్య అభిమానులు ట్రోల్ చేస్తున్నారు..