ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తప్పిన ప్రమాదం..

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తప్పిన ప్రమాదం..

0
42

నాగ్‌పూర్‌ – ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. నాగ్‌పూర్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్‌ కాకుండానే రన్‌వేపై నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించిన పైలట్‌.. ఆ విమానాన్ని రన్‌వే నుంచి ట్యాక్సీవేకు తీసుకెళ్లారు. ఈ విమానంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ఉన్నారు. ఇక విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ దించేశారు. సాంకేతిక లోపాన్ని ముందే పసిగట్టడంతో పెనుప్రమాదం తప్పిందని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లాల్సిన ప్రయాణికులందరూ నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు.