బిగ్‌బాస్‌ 5: కాజ‌ల్ రెమ్యున‌రేష‌న్‌ ఎంతో తెలుసా?

Big Boss 5: Does Kajal know much about remuneration?

0
111

బిగ్ బాస్ సీజన్ 5 నుండి 14వ వారం ఎలిమినేట్ అయిన కాజ‌ల్ హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు ఫుల్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పంచింది. కాజ‌ల్ గొడ‌వ‌ల‌కు కార‌ణం అవుతుంద‌ని, ఆమె వెళ్లిపోతే గొడ‌వ‌లు త‌గ్గుతాయ‌ని హౌజ్‌మేట్స్ ప‌లుమార్లు అభిప్రాయ‌ప‌డ్డారు. ఎట్ట‌కేల‌కు బిగ్ బాస్ చివ‌రి వారం ఆమె హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో కాజల్ ఎన్నో పరీక్షలను ఎదుర్కొంది. మొదట్లో అందరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ వారి పర్సనల్స్‌ గురించి కూపీ లాగే ప్రయత్నం చేసినందుకుగానూ ఆమెను లేడీ నారదగా పేర్కొన్నారు. అందరితోనూ గొడవపడుతుంటే స్క్రీన్‌స్పేస్‌ కోసం డ్రామాలన్నారు. బిగ్‌బాస్‌ అనేది తన డ్రీమ్‌ అంటూ ప్రతి విషయానికి ఎగ్జైట్‌ అవడాన్ని సైతం అందరూ తప్పుపట్టారు. గేమ్‌లో తను వాడే స్ట్రాటజీలను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరేమన్నా, ఎవరేమనుకున్నా పట్టించుకునే ప్రసక్తే లేదన్నట్లుగా తనకు నచ్చినట్లుగా ఉంటూ వచ్చింది కాజల్‌.

ఈ క్రమంలో బిగ్‌బాస్‌ నుంచి కాజల్‌కు ఎంత ముట్టిందన్న చర్చ మొదలైంది. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాజల్‌కు వారానికి రూ. 2 లక్షల పైనే పారితోషికం ఫిక్స్‌ చేశారట! అంటే 14 వారాలకు గానూ కాజల్‌కు 30 లక్షల రూపాయలు ముట్టినట్లు తెలుస్తోంది. తనకు రూ.30 లక్షల అప్పు ఉందన్న కాజల్‌ ఈ రెమ్యునరేషన్‌తో ఆ రుణ భారాన్ని వదిలించుకునే అవకాశం ఉంది.