రిలీజ్ కు ముందు విజయ్ ‘లైగర్’ కు బిగ్ షాక్..!

0
124

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ లైగర్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమానుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ‘లైగర్’ ఆగస్టు 25న విడుదలకానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం వ‌రుస ప్ర‌మోష‌న్‌ల‌తో బిజీగా ఉన్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కు వెళ్ళింది. అయితే ఇక్కడ లైగర్ కు సెన్సార్ బోర్డు నుంచి పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు 7 కట్స్ చెప్పారట. దీనికి సంబంధించిన సెన్సార్ రిపోర్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అభ్యంతరంగా ఉన్న ఏడు సన్నివేశాల్లో కొన్ని పూర్తిగా తొలగించాలని, మరికొన్ని చోట్ల మ్యూట్ పెట్టాలని సెన్సార్ బోర్డు సభ్యులు సూచించారట. దీనిలో F*** అనే పదం ఎక్కువసార్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పదం వచ్చిన ప్రతిసారి మ్యూట్ వేయాలని కూడా సూచించారని సమాచారం అందుతుంది.