మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు బిగ్ షాక్ తగిలింది. అందుకు కారణం ఆయన నటించిన తాజా సినిమా ‘సెల్యూట్’ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడం. ఈ చిత్రాన్ని తొలుత థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు.
కానీ అలా చేయకుండా ఓటిటీలో విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇక దీనిపై ఆగ్రహించిన థియేటర్ ఓనర్స్ దుల్కర్ సినిమాలను తమ రాష్ట్రంలోని థియేటర్లలో విడుదల చేయకూడదని నిర్ణయించింది. ‘సెల్యూట్’ థియేటర్ రిలీజ్‌కు సంబంధించి తమతో నిర్మాణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
కానీ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి, మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డైరెక్ట్ ఓటీటీకి వెళ్లడం ఏం బాగోలేదని అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సెల్యూట్’కు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. దుల్కర్‌కు చెందిన నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.