పవన్ ఫ్యాన్స్​కు​ బిగ్ సర్​ప్రైజ్..ఈసారి ‘భీమ్లా నాయక్​’తో!

Big surprise for Pawan fans..this time with 'Bhimla Nayak'!

0
40

పవర్​స్టార్ పవన్​కల్యాణ్ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్. పవన్ మరోసారి తన గానంతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారట. ‘భీమ్లా నాయక్’లో ఓ ప్రత్కేక గీతం పవన్ కళ్యాణ్ పాడనున్నాడట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రేక్షకులకు, అభిమానులకు కిక్కే కిక్.

ఈ స్పెషల్ మ్యూజిక్​ బిట్​ను తమన్ ఇప్పటికే కంపోజిషన్​ చేశాడని.. త్వరలో దీనిని రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది. పవన్​ కల్యాణ్ ఇప్పటివరకు ఎనిమిదిసార్లు సినిమాల్లో పాటలు పాడారు. తమ్ముడు(ఏం పిల్ల మాట్లడవా..), తమ్ముడు(తాటి చెట్టు ఎక్కలేవు..), ఖుషీ(బైబయ్యే బంగారు రవణమ్మ), జానీ(నువ్వు సారా తాగుతా..), జానీ(రావోయి మా ఇంటికి..), పంజా(పాపారాయుడు..), అత్తారింటికి దారేది (కాటమరాయుడా..), అజ్ఞాతవాసి(కొడకా కోటేశ్వరరావు..) ఈ జాబితాలో ఉన్నాయి.

మలయాళ హిట్​ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ చిత్రానికి రీమేక్​గా ‘భీమ్లా నాయక్’ను తెరకెక్కిస్తున్నారు. పవన్​ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. నిత్యామేనన్, సంయుక్త హీరోయిన్లు. తమన్ సంగీతమందిస్తున్నారు. త్రివిక్రమ్.. స్క్రీన్​ప్లే-మాటలు అందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.