పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహేగ్దే జంటగా నటించిన సినిమా ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.రాధేశ్యామ్ నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. మంచు కొండల్లో.. చాలా రొమాంటిక్ గా ప్రభాస్, పూజ హెగ్డే ఈ గ్లింప్స్ లో కనిపిస్తున్నారు… ప్రేమికుల రోజు నేపథ్యంలో.. ఈ సినిమా నుంచి ఈ అప్డేట్ ను వదిలింది చిత్ర బృందం.
https://www.youtube.com/watch?v=URuqzJ2B8ZM&feature=emb_title