బిగ్ బాస్ తెలుగు 3 ఫైనల్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ తెలుగు 3 ఫైనల్ లిస్ట్ ఇదే

0
100

బిగ్ బాస్ తెలుగు3 సీజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. జూన్ రెండోవారం నుంచి ఈ షో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.. ఇక ఇప్పటికే ఇంటి సభ్యుల ఎంపిక పూర్తి చేస్తున్నారు టీం సభ్యులు, అలాగే హౌస్ కు ఎవరిని తీసుకురావాలి, ఇలా అనేక విషయాలలో బిగ్ బాస్ యాజమాన్యం చర్చలు ఇప్పటికే జరిపింది కొందరు కంటెస్టెంట్స్ తో. గతంలో జరిగిన పొరబాట్లు బయట విషయాలు తెలియడం ,ఇలాంటివి ఏమీ జరుగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు హౌస్ నిర్మాతలు, అలాగే సభ్యులు ఒకసారి ఇంటిలోకి వచ్చాక వారికి ఎలాంటి పరిస్దితి వచ్చినా బయటకు వెళ్లేలా లేకుండా చూస్తున్నారు, కేసులు షూటింగులు ఇలాంటివి ఏమీ లేని వారిని ఈసారి తీసుకోవడానికి చూస్తున్నారట. అయితే ఇది సాధ్యమా కాదా అనేది కూడా పరిశీలిస్తున్నారు. మరి ఆ మూడవ ఇంటి సభ్యులు ఎవరు ఉండబోతున్నారు అనేది ఇప్పుడు ఈ లిస్టులో చూద్దాం.

మహాతల్లి ఫేమ్ జాహ్నవి, వెబ్ మీడియా ఆర్టిస్ట్ జ్యోతి, హీరోయిన్ శోభిత ధూళిపాళ, జబర్దస్త్ నరేష్ , యాంకర్ ఉదయభాను, టీవీ ఆర్టిస్ట్ జాకీ, హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ రేణు దేశాయ్, ఆర్టిస్ట్ చైతన్య కృష్ణ, ఆర్టిస్ట్ మనోజ్ నందన్, కమల్ కామరాజు, నాగ పద్మిని, డాన్స్ మాస్టర్ రఘు, సింగర్ హేమ చంద్ర, హీరోయిన్ గద్దె సింధూర, గుత్తా జ్వాల వీరితో పాటు కామన్ మాన్ కేటగిరి నుంచి ముగ్గురుని ఉండబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇంకా ఈ విషయంలో అఫీషియల్ గా ప్రకటన వెలువడాల్సి ఉంది. జూన్ లో బిగ్ బాస్ 3 మొదలు కానుంది. ఇక ఈ షోలో హోస్ట్ ఎవరు అలాగే కంటెస్టెంట్స్ మార్పులేకుండా వీరే కొనసాగుతారా ఇలాంటివి అన్నీ చూడాల్సి ఉంది.