బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఈ వారం అవినాష్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు, అయితే అవినాష్ ఆశలు ఫలించలేదు అనే చెప్పాలి, ఇక చివరి రెండు వారాలు మాత్రమే ఉన్నాయి, అయితే హౌస్ లో ఇక ఉండేది ఐదుగురు మాత్రమే, సో హౌస్ లో ఇప్పటికే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరో తేలిపోయింది, ఇక ఫైనల్ పోరు ఎలా ఉంటుందో చూడాలి, అయితే మరి అవినాష్ జబర్దస్త్ కు వెళతాడా లేదా కొత్త ప్రోగ్రామ్ కు వెళతాడా అనేది అతని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అయితే ఇప్పుడు అతను తాజాగా మరో పది రోజులు విశ్రాంతి తీసుకుని తన నెక్ట్స్ ప్లాన్ చూడనున్నారు, మొత్తానికి కొత్త ఛానల్ కొత్త ప్రోగ్రామ్ తో తను వర్క్ చేయబోతున్నాడు, టీమ్ లీడర్ గా కొత్తగా రానున్నాడు అని తెలుస్తోంది, అయితే జబర్దస్త్ కు అతనికి మళ్లీ తలుపులు తెరుచుకునే అవకాశం లేదు అని సమాచారం.
మొత్తానికి కొత్త ఛానల్ ప్రొగ్రామ్ వారు అవినాష్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది, ఇక రెండు వారాలు తర్వాత ఆ షోలో అవినాష్ రీ ఎంట్రీ ఉంటుందట, మరి దీనిపై అతను అధికారికంగా ప్రకటన చేస్తాడు అని అంటున్నారు, చూడాలి మరి అభిమానులు అదే కోరుకుంటున్నారు, అతని కామెడీ కావాలి అని.