సినిమా అంటే రంగుల ప్రపంచం ఇక్కడ అవకాశాల కోసం వందల మంది వస్తూ ఉంటారు, అయితే సక్సెస్ అందేది అతి తక్కువ మందికి మాత్రమే, అయితే సినిమా చూస్తే కచ్చితంగా అందులో హీరో హీరోయిన్ ధరించే కాస్టూమ్ గురించి మాట్లాడుకుంటారు, వాటిని అభిమానులు కొనాలి అని కూడా భావిస్తారు, కొన్నిసార్లు అవి బయట దొరకవు, దానికి కారణం అవి ప్రత్యేకంగా డిజైన్ చేయించడం వల్ల ఇలా దొరకవు.
సినిమాకి కచ్చితంగా హీరోకి హీరోయిన్ కి కాస్టూమ్ కి ఇంతని నిర్మాత బడ్జెట్ కేటాయిస్తారు.. అందులో వాటిని ఖర్చు చేస్తారు,
గతంలో సినిమా షూటింగులకి బట్టలు అద్దెకి తెచ్చేవారు కాని ఇప్పుడు చాలా మంది అగ్రహీరోలు అలా వాటిని ధరించడం లేదు, అందుకే డిజైనర్లు స్పెషల్ గా తయారుచేస్తున్నారు.. వారి లుక్స్ పర్సనాలిటీకి సరిపడా తయారు చేస్తున్నారు.
మరి ఇలా చాలా బట్టలు ఉంటాయి.. వాటిని ఏం చేస్తారు అనేది చూస్తే, వారికి నచ్చితే వారు తీసుకువెళతారు , కొందరు అయితే వాటిని తీసుకువెళ్లరు, అయితే ఇలా ఉన్న బట్టలను సెకండ్స్ లో అమ్మేస్తారు, కొన్ని డిజైనరీ కంపెనీల వారు వీటిని తీసుకుంటారు, ఇక ఈ డ్రెస్ మంచి ట్రెండ్ సెట్ చేస్తే నిర్మాణ సంస్ధ దానిని వేలం వేస్తుంది, కొందరు నిర్మాతలు వాటిని పక్కన పెట్టి తర్వాత సినిమాకి కూడా వాడతారు. మళ్లీ ఆ హీరోలు నటించే సినిమాలో ఇలాంటి కాస్టూమ్స్ వస్తే వాడరు.. ఈ జాగ్రత్త ఆ స్టైలిష్ట్ లు తీసుకుంటారు, ప్రతీ సినిమాని వారు అబ్జర్వ్ చేస్తారు.