బిగ్ బాస్ – భారీ ఆఫర్ ఇచ్చినా వద్దన్న టాలీవుడ్ హీరోయిన్

బిగ్ బాస్ - భారీ ఆఫర్ ఇచ్చినా వద్దన్న టాలీవుడ్ హీరోయిన్

0
146

ఇది ఆగస్ట్ నెల ఇక బిగ్ బాస్ కూడా బుల్లితెరలో సందడి చేయనుంది, ఇక ఈ షోలో ఎవరు పాల్గొంటారు అనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది, అయితే హోస్ట్ గా నాగ్ అని ఫైనల్ అవుతోంది, అయితే తాజాగా ప్రోమోకి సిద్దం అవుతున్నారు బిగ్ బాస్.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని షోను ప్రారంభించనున్నారు నిర్వాహకులు. ఇప్పటికే హోస్ట్ నాగార్జున ప్రోమో షూటింగులో పాల్గొన్నారు. ఈ మేరకు అన్నపూర్ణ స్లూడియోలో చిత్రీకరణ జరిపారు. ఇక సోషల్ మీడియాలో లిస్ట్ ఇదే అంటూ కొందరి పేర్లు వైరల్ అయ్యాయి, హీరో తరుణ్, హీరోయిన్లు శ్రద్ధాదాస్ తాము షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు.

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ను తాజాగా సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ఆమె ఈ షోలో పాల్గొనేందుకు నో చెప్పింది, ఆమెకి భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట, అయినా ఆమె నో చెప్పింది. చాలా మంది సెలబ్రెటీలు ఈసారి ఉన్నారు అని వైరల్ అయితే అవుతోంది వార్త, చూడాలి ఎవరు ఇందులో పాల్గొంటున్నారో.