బ్రేకింగ్ — స్టూడెంట్స్ క్లాస్ కు వస్తే ఈ టెస్టులు చేయించాలి కీలక నిర్ణయం

బ్రేకింగ్ -- స్టూడెంట్స్ క్లాస్ కు వస్తే ఈ టెస్టులు చేయించాలి కీలక నిర్ణయం

0
30

చాలా మంది ఇప్పుడు కరోనా కారణంగా ఇంటి పట్టున ఉంటున్నారు, ముఖ్యంగా స్కూల్లు కూడా తెరచుకోలేదు, అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం కరోనా తీవ్రత తగ్గింది, దీంతో మళ్లీ అక్కడ స్కూళ్లు కాలేజీలు కార్యాలయాలు వ్యాపారాలు అన్నీ జరుగుతున్నాయి.

తాజాగా ఈ విషయంలో అమెరికాలోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ నుంచి వెలువడిన ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..తరగతులకు హాజరు కావాలంటే మూడుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలి అని తెలిపింది.

ముందు విద్యార్థులు క్యాంపస్ కు చేరుకున్న వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. మూడు రోజుల తర్వాత మరోసారి, ఆ తర్వాత… రెండు రోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేయించుకోవాలి. ఇక… ఫస్ట్ టెస్ట్ ఫలితం వచ్చే వరకు విద్యార్ధులు.. క్వారంటైన్ లో ఉండాలి. తర్వాత సోకలేదు అంటే రెండో ఫలితం కూడా చూడాలి, ఇక మూడో ఫలితం వచ్చాక క్యాంపస్ లో క్లాస్ లకి హజరు కావాలి.