బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షో ముగిసింది. 19 మందితో మొదలైన ఈ షోలో చివరకు సన్నీ, శ్రీరామ్, మానస్, సిరి, షణ్ముఖ్ టాప్ 5 కంటెస్టెంట్స్‌గా మిగిలారు. ఇందులో షణ్ముఖ్ రన్నరప్ గా నిలవగా.. వీజే సన్నీ బిగ్‌బాస్ సీజన్ 5 విజేతగా నిలిచారు. అయితే ఇప్పుడు వీరి రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
బిగ్ బాస్ విజేతగా నిలిచిన వీజే సన్నీ జర్నలిస్ట్‌గా కెరీర్ ఆరంభించి కళ్యాణ వైభోగం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచి ప్రజల మనసులను దొచుకున్నారు. అయితే సన్నీ బిగ్ బాస్ సీజన్ 5లో వారానికి రెండు లక్షలు తీసుకున్నట్లుగా టాక్. అంటే 15 వారాల్లో రూ 30 లక్షలు సంపాదించినట్లుగా టాక్ నడుస్తోంది.
ఇక సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఈ సిరీస్‌తో షన్నూ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇక అదే క్రేజ్‌తో బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. మిగతా కంటెస్టెంట్లతో పోలీస్తే..షన్నూ వారానికి రూ. 2 లక్షల వరకు తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
అలాగే మూడో స్థానంలో నిలిచిన సింగర్ శ్రీరామచంద్ర కూడా రెమ్యునరేషన్ ఎక్కువగానే తీసుకున్నట్లుగా సమాచారం. అలాగే బిగ్‌బాస్ తొలి పైనలిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీరామచంద్ర వారానికి లక్షన్నర తీసుకున్నాడట.
ఇక నాల్గవ స్థానానికి పరిమితమైన మానస్ కూడా ఈ షోలో ఎక్కువగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ షో ద్వారా వారానికి లక్ష నుంచి లక్షన్నర వరకు రెమ్యునరేషన్ అందుకున్నాడట. అంటే పదిహేనువారాలకు సుమారు రూ. 20 లక్షల వరకు అందుకోనున్నట్లుగా టాక్.
సీరియళ్ల ద్వారా ఎక్కువగా పాపులారిటీ సొంతం చేసుకున్న సిరి.. వారానికి రూ. లక్షన్నర వరకు అందుకున్నట్లుగా సమాచారం. అంటే.. పదిహేను వారాలకు గానూ.. సుమారు పాతిక లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.