బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే..అటెండ్ అవ్వనున్న బిగ్ స్టార్స్ వీరే..!

Bigg Boss Season 5 Grand Finale..Who are the Big Stars to attend ..!

0
113

అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా 19 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ చివరి అంకానికి చేరుకుంది. టాప్‌-5లో ఉన్న మానస్‌, శ్రీరామ్‌, సన్నీ, షణ్ముఖ్‌, సిరిలలో విజేతగా ఎవరు నిలుస్తారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

సుమారు 104 రోజులుగా ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈ షో గ్రాండ్‌ఫినాలే ఆదివారం సాయంత్రం ప్రసారం కానుంది. ఇక హౌస్ లో ఉన్న వారిలో ఎక్కువగా సన్నీ, శ్రీరామ్ కు ఓట్లు పడుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ నుంచి రాజమౌళి, ‘బ్రహ్మాస్త్ర’ టీమ్‌ నుంచి రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌, ‘పుష్ప’ ప్రమోషన్స్‌ కోసం రష్మిక, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ స్టేజ్‌పై సందడి చేయనున్నారు.

ఇక సాయిపల్లవి, కృతి, నాని, జగపతిబాబు రానున్నారు. కాగా, కంటెస్టెంట్‌ల ఇంటిసభ్యులు, ఎలిమినేటై ఇంటికి వచ్చిన తోటి కంటెస్టెంట్స్‌ల డ్యాన్స్‌లు, పాటలతో ఈ వేడుకను మరింత సందడిగా మార్చినట్లు కనిపిస్తోంది. పుష్పలో ఈ పాటలో సమంత వేడెక్కించే స్టెప్పులు వేసిన ఉ అంటావా ఊఉ అంటావా పాటకు డింపుల్ హయతి స్టెప్పులేసింది. మొత్తానికి గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా ఉండబోతుందని ప్రోమోతో చెప్పేసారు.