బిగ్ బాస్ విన్న‌ర్ రాహుల్ పై బీరుసీసాల‌తో దాడి

బిగ్ బాస్ విన్న‌ర్ రాహుల్ పై బీరుసీసాల‌తో దాడి

0
89

బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై దాడి జ‌రిగింది, ఆయ‌న‌పై బీరుబాటిళ్ల‌తో దాడి చేశారు కొంద‌రు, ప్ర‌స్తుతం రాహుల్ గ‌చ్చిబౌలిలో ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు, గత రాత్రి 11:45 గంటల ప్రాంతంలో రాహుల్ తన స్నేహితులు, ఓ గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లాడు.

ఆ సమయంలో అక్కడున్న కొంతమంది యువకులు రాహుల్‌ వెంట వున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.దీనిని ప్ర‌శ్నించినందుకు రాహుల్ పై వారు దాడిచేశారు, ఇలా వాగ్వాదం పెర‌గ‌డంతో బీరు బాటిల్స్ తో రాహుల్ ని వారు కొట్టారు.

తీవ్ర రక్తస్రావమైన రాహుల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాహుల్ కి త‌ల‌పై కుట్లు ప‌డ్డాయి అని తెలుస్తోంది..ప‌బ్ లో గొడ‌వ జ‌రిగింది అని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. వారిని అదుపులోకి తీసుకుంటాము అన్నారు పోలీసులు.