ఏపీలో తొలిసారి వైఎస్ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా….

ఏపీలో తొలిసారి వైఎస్ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా....

0
32

మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు.. అదికూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలోనే కావడం గమనార్హం…

తవణంపల్లె మండల పరిధిలోని కాణిపాకపట్నం గ్రామానికి చెందిన వైఎస్ వీరాభిమాని పట్నం రాజమాణిక్యం గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలయం కట్టాడు… సూమారు 7 లక్షలు ఖర్చు చేసి ఆలయాన్ని నిర్మించాడు…ఇటీవలే ఈ ఆలయాన్ని అట్టహాసంగా ప్రారంభించి వైఎస్ కు పాలాభిషేకం చేశారు…

తనకు చిన్న తనం నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే వెలకట్టలేని అభిమానం అని అన్నారు… ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని అన్నారు… ఆయనసేవలు సజీవంగా ఉన్నాయి… ఆయనమీద ఉన్న అభిమానంతోనే గుడి కట్టించానని తెలిపారు…