తాజాగా కింగ్ నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 చేస్తున్నారు, ఇదే సమయంలో ఆయన లాక్ డౌన్ కు ముందు వైల్డ్ డాగ్ సినిమా ఒప్పుకున్నారు, అయితే ఈ సినిమా షూటింగ్ కొంత మేర చేశారు, లాక్ డౌన్ తో ఆగిపోయింది, ఇప్పుడు మళ్లీ చిత్ర యూనిట్ పర్మిషన్ తీసుకోవడంతో మళ్లీ షూటింగ్ పట్టాలెక్కింది.
అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం లో వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం 15 రోజులు మనాలి వెళ్లారు నాగార్జున, అక్కడ నుంచి షూటింగ్ కంప్లింట్ చేసుకున్నారు, ఈ విషయాన్ని ఆయన తెలియచేశారు.. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది అంటూ నాగ్ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.
నా టాలెంటెడ్ టీమ్ కు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు నాగ్. ఇక బిగ్ బాస్ కు ఆయన ఈ వారం రానున్నారు శని ఆదివారాలు ఎంటర్ టైన్ చేయనున్నారు, హోస్ట్ గా నాగార్జున అదరగొడుతున్నారు అనే చెప్పాలి, ఇక ఈ సినిమాతో పాటు నాగ్ బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నారు. తర్వాత బంగర్రాజు సినిమా పట్టాలెక్కిస్తారు అని టాలీవుడ్ టాక్. నాగ్ వస్తున్నారు అని తెలియడంతో బిగ్ బాస్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు.