Akshay Kumar | ముంబై మెట్రోలో ప్రయాణించిన స్టార్ హీరో అక్షయ్ కుమార్

-

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌(Akshay Kumar)మెట్రోలో ప్రయాణించి అభిమానులకు షాక్‌ ఇచ్చారు. బ్లాక్ డ్రస్ వేసుకుని, టోపీ ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని కనిపించారు. ప్రముఖ నిర్మాత దినేష్‌ విజన్‌(Dinesh Vijan)తో కలిసి సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు. అర్జెంట్ పని మీద వేరే చోటకి వెళ్లాల్సి రావడంతో ముంబైలో ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు ఇలా మెట్రోలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతంలో మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా మెట్రోలో ప్రయాణిస్తూ అభిమానులకు సెల్ఫీలు ఇచ్చారు.

- Advertisement -

ఇక ప్రస్తుతం అక్షయ్(Akshay Kumar) సినిమాల విషయానికి వస్తే టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి ‘బడే మియా చోటే మియా’ చిత్రంలో నటిస్తున్నారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. రంజాన్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల కానుంది. దీంతో పాటు స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి(Rohit Shetty) దర్శకత్వంలో సింగం సిరీస్‌లో భాగంగా ‘సింగం అగైన్’ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Read Also: “Guntur Kaaram” మేకింగ్ వీడియో చూశారా..? మహేష్ లుక్ అదిరిపోయింది..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...