మహేశ్ బాబు సరసన బాలీవుడ్ భామ..ఫుల్ జోష్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్

0
137

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు, కీర్తి సురేష్ నటించిన “సర్కారు వారి పాట” మూవీ ద్వారా మహేష్‌ బాబు, కీర్తి సురేష్ విశేషాప్రేక్షాదరణ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత మహేష్ ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సినిమాకు ఒకే చెప్పాడు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుండగా..ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ కోసం ఐశ్వర్యారాయ్ ను ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తుందట.  RRR ఫిల్మ్ స్టోరి రైటర్, రాజమౌళి ఫాదర్ విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్  చేస్తునట్టు సమాచారం తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ విషయం తెలిసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఐశ్వర్యారాయ్, మహేష్‌ బాబు అంటే ఈ సినిమా మంచి సక్సస్ సాదిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇంకా ఈ విషయంపై ఎలాంటి అధికారక ప్రకటన రాకపోవడంతో మహేశ్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు ఫైనల్  చేస్తారో అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.