మన చిత్ర సీమలో ఎంతో మంది హీరోలు హీరోయిన్లు వివాహ బంధంతో ఒకటయ్యారు, ప్రేమించుకుని ఇరు కుటుంబాల సమక్షంలో ఏడు అడుగులు నడిచారు, అయితే తాజాగా ఓ వార్త వినిపిస్తోంది, కొన్ని ఏళ్లుగా ప్రేమలో ఉన్న హీరోయిన్ నయనతార – దర్శకుడు విఘ్నేష్ ఇప్పుడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు దీనికి కారణం కూడా చెబుతున్నారు అభిమానులు.
వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని నెలల క్రితం ప్రచారం జరిగింది. విఘ్నేష్ శివన్ ఓ ఆసక్తికర ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇందులో నయనతార తన చేతిని అతడి గుండెల మీద పెట్టింది. ఆ చేతి వేలికి ఉంగరం ఉంది. సో దీనిని చూసి అందరూ ఇక వీరికి ఎంగేజ్ మెంట్ అయింది త్వరలో పెళ్లి జరుగనుంది అని మాట్లాడుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఇప్పుడు నయన అభిమానులు కూడా దీనిని షేర్ చేస్తున్నారు..2015 నుంచి వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇక దేశంలో పలు పర్యాటక ప్రాంతాలకు వెళుతూ ఉంటాయి ఈ ప్రేమ పక్షులు దీనికి సంబంధించి అనేక ఫోటోలు కూడా అభిమానులతో పంచుకుంటారు.
ReplyForwar
|