బ్రేకింగ్ టాలీవుడ్ చిత్ర సీమలో విషాదం – పొట్టి వీరయ్య కన్నుమూత

బ్రేకింగ్ టాలీవుడ్ చిత్ర సీమలో విషాదం - పొట్టి వీరయ్య కన్నుమూత

0
89

టాలీవుడ్ చిత్ర సీమలో విషాదం అలముకుంది.. తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడు పొట్టి వీరయ్య74 తనువు చాలించారు… కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు.

కాని ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు… ఎన్నో సినిమాల్లో ఆయన అద్బుతమైన పాత్రలు చేశారు, అంతేకాదు సుమారు అన్నీ భాషల్లో కలిపి 500 చిత్రాలు చేశారు.

 

ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగింది..వీరయ్యది నల్గొండ జిల్లా, తిరుమలగిరి తాలూకా ఫణిగిరి గ్రామం. హైస్కూల్లో ఉన్నప్పుడే నాటకాల్లో పాత్రలు వేస్తూ అందరినీ నవ్వించేవాడు. తర్వాత ఆయన మద్రాసు వెళ్లిపోయారు, అక్కడ కూడా చిన్న పని చేసేవారు, ఇలా సినిమాల్లో అవకాశాల కోసం తిరిగేవారు.

 

అప్పట్లో ఆయనకు విఠలాచార్య, భావనారాయణ అవకాశం ఇచ్చారు… అలా అనేక సినిమాల్లో ఆయన నటించారు..అగ్గిదొర సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు . తర్వాత తాతామనవడు, రాధమ్మ పెళ్లి, యుగంధర్, గజదొంగ, గోల నాగమ్మ ఇలా అనేక సినిమాలు చేశారు, ఆయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి…. ఒక్క తెలుగు మాత్రమే కాదు తమిళ కన్నడ మళయాల భాషల్లో పలు చిత్రాలు కూడా చేశారు ఆయన.