బ్రేకింగ్ – టాలీవుడ్ లో విషాదం కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి

బ్రేకింగ్ - టాలీవుడ్ లో విషాదం కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి

0
83

ఈ కరోనా మహమ్మారి చాలా మందిని మన నుంచి దూరం చేస్తోంది.. సెకండ్ వేవ్ తో భారత్ లో ఏకంగా రెండున్నర లక్షల కేసులు రోజు నమోదు అవుతున్నాయి, ఈ సమయంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అయితే గత ఏడాది నుంచి చూస్తే చిత్ర సీమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అంతేకాదు చాలా మంది సినిమా ప్రముఖులు కన్నుమూశారు.

 

2020 నుంచి 2021 ఇప్పటి వరకూ కరోనా వల్ల టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ చాలా మంది సినిమా నటులు ప్రముఖులు దూరం అయ్యారు… తాజాగా టాలీవుడ్ లో విషాదం అలముకుంది. టాలీవుడ్ నిర్మాత సీఎన్ రావు చిట్టి నాగేశ్వరరావు నిన్న మృతి చెందారు. కరోనాతో ఆయన కొంత కాలంగా ఇబ్బంది పడుతున్నారు.

 

తాజాగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన పంపిణీదారుగా, నిర్మాతగా

మంచి పేరు సంపాదించుకున్నారు…మా సిరిమల్లె–అమ్మనాన్న లేకుంటే—బ్రహ్మానందం డ్రామా కంపెనీ- ఈ చిత్రాలు తెలుగులో నిర్మించారు.. ఇక తమిళ్ లో కూడా చిత్రం చేశారు..తమిళంలో ఊరగాఅనే సినిమాను నిర్మించారు. ఇక నిర్మాతల మండలి అసోసియేషన్లో పలు పదవులు చేశారు ఆయన, ఇక ఆయన లేరు అనే వార్త తెలిసి సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు.