BRO Collection | మిక్స్‌డ్ టాక్ వచ్చినా పవర్ స్టార్ పవన్ కల్యాన్ బ్రో చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. కేవలం విడుదలైన మూడ్రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి మరోసారి పవర్ స్టార్ సత్తా ఏంటో నిరూపించారు అభిమానులు మొదటిరోజు రూ. 48 కోట్లు, రెండో రోజు రూ.27 కోట్లు, ఆదివారమైన మూడో రోజు రూ.25 కోట్లు సాధించి.. ఏకంగా మూడ్రోజుల్లోనే రూ.101.54 కోట్లు సాధించింది.
BRO Collection | దీంతో ఇదీ పవర్ స్టార్ రేంజ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రముఖ పాత్రలో నటించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్‌లు కీలక పాత్రల్లో మెప్పించారు. తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కించగా.. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు నిర్మించారు.