పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కలయికలో పి.సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో(Bro Movie)’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈనెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ’మై డియర్ మార్కండేయ’ పాట విడుదలై మెప్పించింది.
ఈ నేపథ్యంలో థమన్ ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ “బ్రో సినిమా ఎంతోమందిని కదిలిస్తుంది. తమిళంతో పోలిస్తే.. ‘బ్రో(Bro Movie)’ కథలో చాలా మార్పులు జరిగాయి. పవన్ రాకతో.. ఈ సినిమా స్కేల్, ఇమేజ్ మారిపోయింది. యంగ్ లుక్ వచ్చింది. ఈ సినిమాలో ఓ సరికొత్త పవన్‌ని చూస్తారు. పవన్, తేజ్‌లను ఒకే స్ర్కీన్‌పై చూడడం పండగలా ఉంటుంది. నేపథ్య సంగీతానికి చాలా స్కోప్ దొరికింది. ఫస్టాఫ్ చూసి సముద్రఖని గారు కన్నీళ్లు పెట్టుకొన్నారు. తేజ్ సంతోషానికైతే అవధుల్లేవు. పవన్ కల్యాణ్‌కి సంగీతంపై పట్టుంది. ఆయన అభిరుచికి తగినట్టుగానే పని చేశాం’’. అంటూ తమన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Read Also: డైట్ లో ఉన్నవారికి కొవ్వు లేని బెస్ట్ చిరుతిళ్ళు
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat