BRO Teaser Update | పూనకాలు తెప్పిస్తోన్న పవన్ కల్యాణ్ సినిమా కొత్త పోస్టర్

-

BRO Teaser Update | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటిస్తున్న సినిమా బ్రో(BRO). తమిళ్‌లో వచ్చిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తుండగా.. సాయితేజ్ భక్తుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాను విలక్షణ నటుడు, రచయిత, దర్శకుడు అయినా సముద్ర ఖని(Samuthirakani) తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పోర్షన్ షూటింగ్ మొత్తం పూర్తి చేసిన సముద్రఖని షూటింగ్‌ను చివరిదశకు తీసుకొచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

- Advertisement -

పవన్, సాయి ధరమ్ తేజ్ లుక్స్ విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ మూవీని జులై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే బ్రో మూవీ ప్రమోషన్స్ ను షురూ చేయనున్నారు. తాజాగా బ్రో మూవీ టీజర్(BRO Teaser) అప్డేట్‌ను త్వరలోనే ఇవ్వనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు తేజ్ కూడా ఉన్నాడు. ఇద్దరు అదిరిపోయే స్టిల్స్‌లో కనిపించారు.

Read Also:
1. ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ
2. లంచ్ బాక్స్ స్పెషల్: హైదరాబాద్ దమ్ కిచిడీ

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...