త్వరలో ముంబైలో కొత్త ఇల్లు కొంటున్నా- ప్రకటించిన బన్నీ ఎక్కడంటే

త్వరలో ముంబైలో కొత్త ఇల్లు కొంటున్నా- ప్రకటించిన బన్నీ ఎక్కడంటే

0
34

అల వైకుంఠపురములో చిత్రం ఈ ఏడాది సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది, ఈ సినిమా బన్నీకి అత్యధిక వసూళ్లు సాధించి ఆల్ టైం హిట్ చిత్రంగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది, అంతేకాదు ఈ సినిమాని బాలీవుడ్ లో కూడా ప్లాన్ చేస్తున్నారు.. అలాగే రెండు మూడు భాషల్లో రిలీజ్ చేయాలి అని చాలా చిత్ర పరిశ్రమలు ఆలోచిస్తున్నాయి.

బన్నీ ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు.. అయితే ఈ సక్సెస్ లో భాగంగా తాజాగా జాతీయ మీడియాతో బన్నీ ముచ్చటించారు.. ఆ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు చెప్పారు ఆయన..
తనకు బాలీవుడ్ సినిమాలు అంటే ఇష్టం అని చెప్పారు, తనకు కూడా బాలీవుడ్ సినిమాలు చేయాలని ఉంది అని అన్నాడు బన్నీ.

ఇక బన్నీకి ముంబైలో ఇళ్లు ఉంది అని అనేక వార్తలు వినిపిస్తాయి.. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
ముంబైలో ఉన్న అపార్ట్మెంట్ నాది కాదు. అది గీతా ఆర్ట్స్ సంస్థ గెస్ట్ హౌస్. నాకు ముంబై అంటే చాలా ఇష్టం. తరచుగా ఇక్కడికి వస్తుంటా ఇక మా సంస్ధ అపార్ట్ మెంట్ కాబట్టి అక్కడే ఉంటా అన్నారు ఆయన, త్వరలో మంచి ఇల్లు ముంబైలో కొంటాను అని చెప్పాడు బన్నీ.