బాలీవుడ్ ని క్యాన్సర్ మహమ్మారి వేధిస్తోంది, తాజాగా బీ టౌన్ లో ఈ ఏడాది పలువురికి క్యాన్సర్ సోకింది, అయితే తాజాగా నేడు సంజయ్ దత్ కు క్యాన్సర్ అని తెలియడంతో అభిమానులు షాక్ అయ్యారు, అయితే బీ టౌన్ లో చాలా మంది ప్రముఖులు క్యాన్సర్ తో కొన్నేళ్లు పోరాటం చేసి చనిపోయారు కొందరు జయించారు. మరి వారు ఎవరు అనేది చూద్దాం.
నటి డింపుల్ కపాడియా సోదరి సింపుల్ .. 2009లో క్యాన్సర్ తో పోరాడి మరణించారు
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా కాన్సర్ బారిన పడ్డాడు. దానిపై విజయం సాధించారు, మళ్లీ క్రికెట్ లో దుమ్ముదులిపేశాడు
బాలీవుడ్ నటుడు ఫిరోజ్ ఖాన్ కూడా కాన్సర్‌తోనే 2009లో కన్నుమూశారు.
రాకేష్ రోషన్‌కి భయంకరమైన త్రోట్ కాన్సర్ సోకింది.ఆయన తర్వాత కోలుకున్నారు.
బాలీవుడ్ మాజీ సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా కాన్సర్‌తో పోరాడి ఓడిపోయారు 2012లో కన్నుమూశారు.
ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా… 2017లో కన్నుమూశారు. ఆయనకు బ్లడ్ కాన్సర్ సోకింది
నటుడు విలక్షణ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్… న్యూరోఎండోక్రిన్ కాన్సర్‌తో ఈ ఏడాది మరణించారు
రిషి కపూర్ క్యా న్సర్‌తో పోరాడి 2020 ఏప్రిల్ 30న కన్నుమూశారు.
సంజయ్ దత్ తల్లి… ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్.. 1981లో కన్నుమూశారు. ఆమెకు పాంక్రియాటిక్ కాన్సర్ సోకింది..
మనీషా కొయిరాలా కూడా కాన్సర్‌ను జయించారు
సోనాలీ బింద్రే కాన్సర్‌తో విజయవంతంగా పోరాడింది విజయం సాధించింది