సీనియర్ నటి సుమలత కుమారుడి పెళ్లిలో ప్రముఖుల సందడి 

actress Sumalatha

సీనియర్‌ నటి(Actress Sumalatha), కర్ణాటక ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్‌ వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కుమార్తె అవివాతో ఆయన పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu), సూపర్ స్టార్ రజనీకాంత్‌, సీనియర్ హీరో మోహన్‌బాబు, ఎంపీ రఘురామ కృష్ణం రాజు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కేజీఎఫ్ స్టార్ యశ్, కిచ్చా సుదీప్, తదితర కన్నడ హీరోలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ పరిశ్రమల్లో నటించిన సుమలత(Actress Sumalatha) కన్నడ నటుడు అంబరీశ్‌ను వివాహం చేసుకున్నారు. 2018లో అంబరీశ్‌ మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమె బీజేపీ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

Read Also:
1. మొలకలు వారు తింటే.. అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే!
2. ‘ఆదిపురుష్’ లక్ష్మణుడి పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here