బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్‌పై కుట్ర చేస్తున్నారు: సీతక్క

MLA Seethakka

ఒరిస్సా రైలు ప్రమాదంలో మరణించిన వారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka) నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు. ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. పేపర్ లీకేజీని(TSPSC Paper Leak) పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏం తప్పు చేసిందని బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్(KCR) అంటున్నారని నిలదీశారు.

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి వలన రైతుల ఇబ్బందులను సీఎం కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు. వీఆర్ఓ వ్యవస్థను తీసివేసి కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారని అన్నారు. తెలంగాణలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ పాలనలో మహిళలకు ప్రాధాన్యత లేదని అభిప్రాయపడ్డారు. మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించండంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని సీతక్క(MLA Seethakka) కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also:
1. TSPSC: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here