బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో చైతూ సినిమా ? మరో దేవదాస్ సినిమా చేయాలని నెటిజన్ల కామెంట్స్

0
102

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇటీవల థాంక్యూ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయిన మంచి సినిమాగా నిలిచింది. ఇందులో నాగచైతన్య నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఇందులో మూడు షేడ్స్ లో చై నటన అద్భుతమనే చెప్పాలి. అలాగే చై మొదటిసారిగా బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన ఈ సినిమాలో చైతూ.. సౌత్ అబ్బాయి బాలరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, బాలరాజు ఇంట్రడ్యూసింగ్ వీడియో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం చైతూ ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. బీటౌన్ స్టార్ డైరెక్టర్ సంజాయ్ లీలా భన్సాలీ చై కాంబినేషన్ లో సినిమా రానున్నట్లు సమాచారం. సంజాయ్ లీలా భన్సాలీ కార్యాలయంలో చైతూ కనిపించడం ఇందుకు కారణం. ఇదే నిజమైతే చైతూ సంజయ్ లీలా కలిసి మరో దేవదాస్ సినిమా చేయమని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.