చిరంజీవి 153 వ చిత్రం ఆ దర్శకుడితోనేనా

చిరంజీవి 153 వ చిత్రం ఆ దర్శకుడితోనేనా

0
87

మెగాస్టార్ చిరంజీవి సైరా తర్వాత చేస్తున్న సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చిత్రం. మరి ఈ సినిమా వంద రోజుల్లో పూర్తి చేయాలి అని చూస్తున్నారు. షూటింగ్ కూడా శరవేగంగా చేయాలి అని భావిస్తున్నారు. చిరు అంటే ఎప్పటి నుంచో కమర్షియల్ సినిమాలకే కేరాఫ్ అడ్రస్, అయితే ఆయనతో మరో కమర్షియల్ హిట్ చేయాలి అని చాలా మంది దర్శకులు నిర్మాతలు భావిస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ కొరటాల చిత్రం పూర్తి అయిన తర్వాత మరో సినిమాని కూడా ట్రాక్ లో పెడుతున్నారట. కమర్షియల్ డైరెక్టర్ హరీశ్ శంకర్తో చిరంజీవి పనిచేయబోతున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. ఇటీవల చిరంజీవిని హరీశ్ కలిశాడట. మంచి స్క్రిప్ట్ను సిద్ధం చేయమని చిరు అడగడటంతో హరీశ్.. ఆయన్ని మెప్పించేలా స్క్రిప్ట్ను సిద్ధం చేసే పనిలో తలమునకలై ఉన్నాడట.

అయితే హరీశ్ శంకర్ ఇప్పటికే మెగా హీరోలతో సినిమాలు చేశారు. గత ఏడాదిలో గద్దలకొండ గణేష్ చిత్రంతో హీరో వరుణ్ తేజ్ కు సూపర్ హిట్ ఇచ్చాడు, అలాగే పవన్ కల్యాణ్ కు గబ్బర్ సింగ్ ఇచ్చాడు, బన్నీకి డీజే ఇచ్చాడు, సో అందుకే ఇప్పుడు నేరుగా మెగాస్టార్ తో సినిమా చేయనున్నారట.