చిరంజీవి(Chiranjeevi) తన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’ నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. మూవీలోని సంగీత్ పాట ‘జామ్ జామ్ జజ్జనకా’ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను గ్లింప్స్‌ను లీక్ చేశారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక పాట సెట్ చిరంజీవి అందరితో సరదాగా గడుపుతున్నట్లు ఒక వీడియోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అందులో తను తోటి నటీనటులతో సరదాగా కూర్చొని మాట్లాడుతున్నట్లు కనిపించాడు. అయితే తమన్నా, కీర్తి సురేష్‌లతో కూడా చాలా ఫ్రీగా కనిపించాడు. ఆ సమయంలో కీర్తి సురేష్ ఏదో మాట అనటంతో వెంటనే చిరంజీవి ఆమె వైపు కోపంగా చూసి. ఆ తర్వాత గొంతు పట్టుకొని కనిపించాడు. ఇదంతా సరదాగా సాగిన దృశ్యం అని చెప్పాలి. ఇక చిరంజీవి అలా సరదాగా చేస్తుండటంతో కీర్తి సురేష్ నిజంగా చెల్లెలా కనిపించినట్లు అనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.