US మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై మరో కేసు

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) కేసు నమోదైంది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించారు. రహస్య పత్రాల కేసులో తనపై ఫెడరల్ అభియోగాలు మోపినట్టు పేర్కొన్నారు. జూన్ 13న మియామిలోని ఫెడరల్ కోర్టు హౌస్‌లో హాజరుకావాలని ఆయనకు సమన్లు ఇచ్చినట్లు తెలిపారు. 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికెన్​పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థిగా దూసుకెళుతున్న తరుణంలో క్రిమినల్​కేసులు ట్రంప్‌ను వెంటాడుతుండటం సర్వత్రా చర్చలకు దారితీసింది. అయితే, 2021లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ట్రంప్ ప్రభుత్వానికి చెందిన వందలాది కీలక పత్రాలను ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో ఎస్టేట్‌కు తరలించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, భ‌ద్రత లేని ప్రదేశాల్లో ఆ డాక్యుమెంట్లు ఉండ‌రాదు. దీంతో మొత్తం ఏడు అభియోగాల‌ను ట్రంప్‌పై న‌మోదు చేశారు. మంగ‌ళ‌వారం రోజున మియామి కోర్టులో ట్రంప్ హాజ‌రుకావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...