హైదరాబాద్‌లో జరిగిన తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆరిజన్ డే కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ఈ ఈవెంట్‌కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ టాపిక్ మీద చిరంజీవిని ప్రశ్నలు అడిగాడు. తాను హీరోగా మంచి స్థానానికి వచ్చినా కూడా షాంపు బాటిల్ అయిపోయినప్పుడు నీళ్లు పోసి.. షేక్ చేసి వాడుకునే వాడిని అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేశారా అని చిరును అడిగారు.
ఇందుకు ఆయన స్పందిస్తూ తన అనుభవాలను పంచుకున్నారు. “నువ్వే కాదు, నేను కూడా ఇప్పటికి కొన్ని మిడిల్ క్లాస్ పనులు చేస్తాను. ఇంట్లో లైట్స్ ఆన్ చేసి వదిలేస్తారు. గీజర్ ఆన్ చేసి వదిలేస్తారు. నేనే చూసుకుని ఆఫ్ చేస్తాను. ఇటీవల చరణ్ బ్యాంకాక్ వెళ్తే వాళ్ల ఫ్లోర్ లో లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయాడు. మా ఇంట్లో లైట్స్, ఫ్యాన్స్, ఏసీ ఇలా నా ఫోన్‌కి కనెక్షన్ పెట్టుకున్నాను. ఓపెన్ చేసి చూస్తే చరణ్ అయిదు లైట్లు ఆన్ చేసి వెళ్లిపోయాడు. చూసుకోరు వెధవలు.. అవన్నీ వేస్ట్ కదా. మళ్లీ అవన్నీ నా ఫోన్ నుంచి నేనే ఆఫ్ చేసాను. అలాగే సోప్ అయిపోతుంటే కొత్త సబ్బు, పాత సబ్బుని కలిపి ఓ సబ్బుగా కంప్రెస్ చేసి వాడుతాను ఇలాంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీ చాలా అవసరం. అన్నీ పొదుపుగా వాడుకోవాలి కరెంటు, నీరు అన్నీ చాలా ముఖ్యమైనవి” అని వెల్లడించారు. దీంతో మెగాస్టార్(Chiranjeevi) వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.