MLC Election Counting | మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా

-

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు(MLC Election Counting) వాయిదాపడింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మంగళవారం జరగాల్సిన లెక్కింపు ప్రక్రియను జూన్ 2వ తేదీకి వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పింది. జూన్‌ 1న దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తైన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్ర‌క్రియ చేప‌ట్టాల‌ని ఆదేశించింది. దీంతో జూన్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు.

- Advertisement -

MLC Election Counting | కాగా ఈ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ మార్చి 28న జరిగిన సంగతి తెలిసిందే. ఓటింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను మహబూబ్ నగర్ బాయ్స్ జూనియర్ కాలేజీలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఏకంగా 99.86శాతం పోలింగ్ నమోదుకావడం విశేషం.

Read Also: రామ్‌చరణ్ వెధవ.. చిరంజీవి కామెంట్స్ వైరల్..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...