చిరంజీవి కొరటాల మణిశర్మ అక్కడకు వెళుతున్నారట

చిరంజీవి కొరటాల మణిశర్మ అక్కడకు వెళుతున్నారట

0
119

చిరంజీవి కొరటాల సినిమా ఇక ఈ నెల 10 నుంచి 15 మధ్యలో ప్రారంభం అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇక మెగాస్టార్ సినిమా అంటే అందరూ పెద్ద నటులు ఉంటారు అనేది తెలిసిందే డ్యాన్సులే కాదు పాటలు కూడా ఆయన సినిమాకి బాగా ప్లస్ గా నిలుస్తాయి.

మరి ఆయన కాంపాండ్ లో సినిమాలు అంటే డీఎస్పీ పేరు మ్యూజిక్ డైరెక్టర్ గా వినిపిస్తుంది.. కాని ఇప్పుడు కొరటాల చిరు సినిమాకి సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకున్నారు. ఆయన బ్యాంకాక్ చేరుకుని అక్కడున్న ఓ ప్రైవేట్ రిసార్టులో కొత్త బాణీలపై కసరత్తు చేస్తున్నారు.

అంతేకాదు చిరు కొరటాల కూడా అక్కడకు వెళుతున్నారట అయితే మణిశర్మ గతంలో చిరుకి ఆల్ టైం హిట్ సాంగ్స్ అందించాడు.ఇద్దరూ మంచి మిత్రులు అందుకే మణిశర్మ సరికొత్త ట్యూన్స్ తన టీమ్ తో అందించనున్నారట.కథానాయికగా త్రిషని ఎంపిక చేస్తునారు అని తెలుస్తోంది. మరి మణిశర్మ ట్యూన్స్ ఎలా ఉంటాయో చూడాలి.